తెలుగు నవలా సాహిత్యంలో ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తున్న కొమ్మూరి వేణుగోపాలరావుగారి సరికొత్త ఎక్స్‌పరిమెంట్‌ - భారతి.

'కుష్టు' మనం భయపడేంత భయంకరమా? లలిత సుందర సుకుఆర త్యాగధనుల స్వర్గసుఖాలకు ఈ దోషం ఒక అడ్డంకా? కాదు కాదని నిరూపించిన, మహామానవతా ధృక్పదంతో వ్రాసిన వైజ్ఞానిక నవల భారతి.

ఆ వ్యాధిపై ఇంత కథ రాయవచ్చుననీ, అందునా ఇంత మృదు మధురంగా కథ అల్లుకోవచ్చుననీ ఇంతవరకూ ఎవ్వరూ ఊహించని విషయం. అంతులేని మృదుత్వం, నిశ్చల సెలయేటి వంటి శైలీ, సంఘటన ద్వారా కథ చెప్పే విధానం, గుండెల్ని కోసే సంభాషణలతో మైమరిపించే మృదు సుగంధం- 'భారతి'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good