జాతీయోద్యమం దాదాపు శతాబ్దంపాటు జరిగింది. అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రానంతర భారతదేశానికి వారసత్వంగా వచ్చిన లక్ష్యాలు, ఆందోళనా, పోరాట రూపాలు, రాజకీయ నైతిక విలువలూ ఏ మేరకు అనుసరణీయాలో ఆలోచించాలి. నూతన దశకు చేరిన దేశంలో ఆ లక్ష్యాల సాధనకు గల అవకాశాలను, ఆటంకాలను, పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెరవేర్చడానికి అనుసరించవలసిన పద్ధతులను, దేశంలోని లౌకిక శక్తులు, ప్రత్యేకించి వామపక్ష శక్తులు పునరాలోచించాలి. ఏడు దశాబ్దాలు గడిచిన స్వతంత్ర భారతంలో భిన్న రూపాల్లో కులం, మతం రాజకీయరంగ ప్రవేశం చేయబడి దేశ సామాజిక జీవనాన్ని తిరోగమింపజేస్తున్నాయి. ఒకవైపున పెట్టుబడిదారీ సంబంధాలు నానాటికీ బలంగా వేళ్ళూనుకొంటుండగా, మరోవైపున సామాజిక తిరోగమనం వైపు దేశం నడవడం విచిత్రమైంది. ‘‘పెట్టుబడి’’ పెరుగుదలకూ, దాని సంబంధాల విస్తృతికీ ఆటంకాలుగా ఉన్న పాత, బూజుపట్టిన సామాజిక సంబంధాలు పటాపంచలు కావాలి. ఆ విధంగా జరగడంలేదు. దీనికి మూలాలు ఎక్కడున్నాయో చరిత్రకారులూ, ప్రత్యేకించి వామపక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొనే మేధావులు పరిశీలించాలి. దేశ పురోగమనానికి అవసరమైన మార్గాలనూ, వాటికి ఆటంకాలుగా ఉన్న సామాజిక శక్తులను గుర్తించి ఓడించాలి. ఆ విధమైన క్రియాశీల కార్యక్రమానికి స్వాతంత్య్ర పోరాట కాలంనాటి పోరాట రూపాలనూ, ఎత్తుగడలను సమీక్ష చేయడం ద్వారా గ్రహించగలిగిన అంశాలను, సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక పోరాటాలకు అన్వయించి ఉపయోగించుకోవాలి.

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good