Bharatha Ardhika Vyavastha - 2
Rs.300.00
In Stock
Author: S.A.Vidyasagar

Publisher: CFIR Prachuranalu
-
+

      మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఇది రచయిత విద్యాసాగర్‌ మూడో పరిశోధనాంశం. అధ్యయన క్రమంలో ఇంతవరకు మా దృష్టిలోకే రాని సమాచారం పెద్ద ఎత్తున మాకు అందుబాటులోకి వచ్చింది. నేడు మనం చూస్తున్న భారతదేశ పారిశ్రామిక వర్గం పోగుచేసుకున్న అపార ధనరాశులకు వున్న మూలాలు దిగ్బ్రాంతికి గురిచేస్తాయి. అత్యంత అమానవీయ పరిస్థితులు ఎదుర్కొన్న శ్రమజీవుల కడగండ్ల ముందు అన్ని విషాద కావ్యాలూ జీవంలేనివిగా కనబడతాయి. భారతదేశంలో ఆధునిక కార్మికుడి ఆవిర్భావం రక్తమాంసాల చరిత్రగా నమోదయింది. రచయిత చెప్పినట్లు తాను చెప్పాలనుకున్న విషయం ఒక సంపుటిలో ఇమడనంతగా పెరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్టు నాలుగు సంపుటాలుగా మీముందుకొస్తోంది. మీరిప్పటికే 1857 నుంచి 1947 వరకు  ఈ దేశంలో శ్రమ ఒక సరుకుగా మారిన క్రమాన్నీ శ్రమ సృష్టించిన విలువనూ చర్చించిన మొదటి వాల్యూంను చదివారు. మొదటి సంపుటిని శ్రామిక వర్గ శ్రేణులు, సామాజిక మార్పును ఆకాంక్షించే బృందాలు గొప్ప ఆసక్తితో స్వీకరించాయి. అర్థశాస్త్రాన్ని అర్థంకాని బ్రహ్మపదార్థమనే భావనను ఈ పుస్తకం తొలగించిందని ఈ బృందాలు వ్యక్తం చేస్తున్నాయి.

మీ చేతిలో ఉన్న ఈ రెండవ సంపుటి భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పోగుపడిన క్రమాన్నీ దాని పంపిణీ జరిగిన తీరుని చర్చిస్తుంది. ఈ సంపుటితో 1857 నుండి 1947 వరకూ జరిగిన అర్థశాస్త్ర చరిత్ర పూర్తవుతుంది.

పేజీలు : 394


Write a review

Note: HTML is not translated!
Bad           Good