మిత్రశ్రీ మాట్లాడుతూ ''ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము'' అని ఎంత కాలం క్రితమో, రాయప్రోలు సుబ్బారావుగారు గళమెత్తి పలికాడు. కానీ విదేశాలలో నివసిస్తున్న మన భారతీయ అమెరికన్లు, ఈ సందేశాన్ని మరచినట్లు తోస్తున్నది. భారతీయ ఆత్మ కలిగుండి శ్వేతజాతి శరీరంతో బ్రతుకుతున్న ఒక అనామక రచయిత చెప్పిన మాటలు మనకెంత ఉత్ప్రేరకాలో గమనించండి.
''నా తల్లి పోలెండ్ దేశస్థురాలు. నా తండ్రి ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. నా చిన్నతనంలో నేను పెరిగింది తిరువణ్ణామలైలోని రమణాశ్రమంలో. నా తల్లిదండ్రులిద్దరూ రమణ మహర్షి బోధనలకు అంకితమైనవారు. నా చిన్నతనమంతా తమిళనాడులోని ఆ ఆశ్రమంలో గడిచిన కారణాన అరవభాష ధారాళంగా మాట్లాడగలిగేవాణ్ణి. నా చుట్టూ ఉంటూండే భారతీయుల సహజంగా తమ దేవం, తమ భారతీయ వారసత్వం మొదలైన వాటిని అమితంగా అభిమానించేవారు. యూరోపియన్లు భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి నుండి ఎంతైనా నేర్చుకోవచ్చు నంటుండేవారు....
పేజీలు : 195