తేనచుక్క నాలిక మీద పడగానే అప్రయత్నంగా నోరంతా తీయగా అయిపోతుంది. అదేవిధంగా రచనను చదవడం ప్రారంభించగానే అందులోని భావమంతా అప్రయత్నంగా పాఠకుడి మనసులో ప్రవేసించాలి . అలా కాని పక్షంలో అ రచన మూగవాళ్ళు చేవిటివాళ్ళు ఆడుకునే ముచ్చట మాదిరిగా మిగిలిపోతుంది.
విశేషానుభవం రచనా పాటవం వున్నా ప్రసిద్ద గ్రంధ కర్త శ్రీ శ్రీ వాసవ్య గారు రాసిన బిన్న బిన్న రంగాల మహామనీషులు జీవిత రేఖలను సంపుటీకరించిన ఈ గ్రంధం ఇతరం పాఠకులకు మనోజ్ఞ దృశ్యకావ్యంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ప్రఖ్యాతుల మహామహులు జీవిత చరిత్రలను ఎన్నిటినో చదివిన పాఠకులకు కూడా ఈ చక్కటి జీవన రేఖా చిత్రాల ఏంతో  కొతాదనంతో అలరిస్తాయని భావిస్తున్నాము.  మహామనీషులు సీరీస్ లో జాతీయ , అంతర్జాతీయ ప్రముఖుల , విభిన్న రంగాలకు చాందిన మహానుభావులు, వర్తమానంలోని యువతరం ప్రతినిధుల జీవిత చరిత్రలు రాబోతున్నాయి. ఏ వయసు వారికైనా జీవిత పరమార్ధాన్ని స్పూర్తిని అందించేవి జీవిత చరిత్రలే ! సాహిత్య ప్రక్రియలలో శక్తి వంతమైన సాధనం జీవిత చరిత్ర రచన. చక్కని తెలుగుదనం ఉట్టిపడిన ఈ గ్రంధంలోని జీవిత చరిత్రలు పాఠకులను చివరి వరకూ ఆసక్తితో, అనురక్తితో చదివించి అభిరుచిని పెంచగలవని ఆశిస్తున్నాము. పాఠకుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good