''పత్రికొక్కటి యన్న - పదివేల సైన్యంబు''

ప్రజలకు సమాచారాన్ని అందించడం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పరిణామాలను తెలియజేయడం వంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాలను నిర్వహిస్తున్నది పత్రికారంగం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులనూ, ఎగుదు దిగుళ్ళనూ చవి చూసింది. నిబద్ధత గల జర్నలిస్టులనూ, సంపాదకులనూ రూపొందించుకున్నది.ఇతర ఉద్యోగ అవకాశాలనూ, సంపాదన రంగాలనూ వదులుకుని ప్రత్యేకమైన అభినివేశంతో పాత్రికేయవృత్తిని ఎంచుకున్న ధన్యజీవులున్నారు. విముక్తి పోరాటాలకూ, స్వాతంత్య్రోద్యమాలకూ, ప్రజల ఆకాంక్షలకూ, ఆగ్రహానికీ, లక్ష్యాలకూ పత్రికలు అద్దం పట్టాయి. అనేక సందర్భాలలో నిషేధాలకూ, నిర్బంధాలకూ, ఆంక్షలకూ, పాలకుల కోపాగ్నికీ గురయ్యాయి. ఇదొక ఉజ్వల ఇతిహాసం. 'ప్రజాస్వామ్య సౌధ నిర్మాణంలో నాలగవ స్తంభం పత్రికారంగం' అంటారు.

ఇక భారతీయ పత్రికా రంగానికి గర్వించదగిన గళం ఉంది. వన్నె తెస్తున్న వర్తమానం ఉంది. ఉజ్వలమైన భవితవ్యం ఉంది. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మిత్రుడు మాడభూషి కృష్ణప్రసాద్‌ 'భారతీయ పత్రికారంగ చరత్ర'పై విలువైన సమాచారాన్ని సేకరించాడు. ఒడుపుగా విశ్లేషించాడు.

- ఎస్వీ సత్యనారాయణ

         ప్రధాన సంపాదకుడు

నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైద్రాబాద్‌.

Pages : 283

Write a review

Note: HTML is not translated!
Bad           Good