భారతీయ భాషలన్నింటా కథలు పుంఖానుపుంఖంగా నిరంతరం వెలువడుతున్నాయి. జీవనది లాంటి ఆ ప్రవాహంలోంచి ఏరిఏరి కొన్ని దోసిళ్ళ కథలు డాక్టర్‌ దేవరాజు మహారాజు తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళందరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచ సాహిత్య పటం మీద భారతీయతను జెండాలా రెపరెప లాడించిన వారు. అందుకే ఈ కథల్ని 'విశాలాంధ్ర ప్రచురణాలయం' సగర్వంగా సమర్పిస్తోంది.

భారతీయ రచయితలు తమ తమ అవగాహనను బట్టి, ఆలోచనా ధోరణిని బట్టి, సామాజిక ఆవశ్యకతను బట్టి రచనలు చేస్తున్నారు. సంప్రదాయ రీతిలో, మతాల నీడలో, ఆధునిక రీతిలో, అత్యాధునిక రీతిలో, ప్రగతివాదంతో, విప్లవ చైతన్యంతో ఒక్కోసారి మళ్ళీ అనుభూతుల్ని తిరగతోడుకుని భారతీయ భాషలన్నింటా రచనలు పుంఖానుపుంఖంగా వెలువడుతూనే ఉన్నాయి. ఇంకా వెలువడుతూనే ఉంటాయి!! జీవనదిలా భారతీయ సాహిత్య రచన మాత్రం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఆ మహాప్రవాహం హోరు ముందు సమకాలీన రచయితలు తమ వంతు ఎంత? తమ బాధ్యత ఎంత? అని తమకు తాము ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. నిజాయితీగా కృషి చేయాల్సి ఉంటుంది.

భారతీయ కథా సాహిత్యంలో నాకు నచ్చిన కొన్ని కథల్ని ఈ సంపుటిలో అందించారు రచయిత డాక్టర్‌ దేవరాజు మహారాజు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good