భారతంలో యక్షప్రశ్నలు ఈ పుస్తకంలో ఏమున్నాయంటే...

శ్రోత్రియుడు అంటే యెవరు? గొప్పదనం యెలా వస్తుంది.

బుద్ధిమంతుడు అవడం యెలా?

బ్రాహ్మణులలో దేవత్వం, నడవడిక, మానుషత్వం యెలా వుంటాయి?

ఆచమనం అంటే?

ఇలాగే క్షత్రియులలో పై గుణాలు యెలా వుంటాయి?

కృషి చేసేవారికి, ఉత్పత్తి చేసేవారికి, ప్రతిష్ఠ కావాలనుకొనేవారికి ముఖ్యమైనవి యేవి?

జీవించివున్నా - ప్రాణంలేని ప్రాణి యెవరు? పంచయజ్ఞాలు అంటే?

భూమికంటే బరువు అయినది ఏమిటి?

వాయువుకంటే శీఘ్రమైనది ఏది?

గడ్డిపరక కంటే తేలిక అయినది ఏది?

నిద్రలో వున్నా రెప్పపాటు లేనిది యెవరికి?

పుట్టినా- కదలక వుండేదియేది? హృదయం దేనికి లేదు?

వేగం వలన ఏది వృద్ధి చెందుతుంది?

అన్ని ప్రాణులకు అతిధియెవరు? అమృతం అంటే ఏమిటి?

ఒంటరిగా తిరిగేది యెవరు?

ధర్మం, కీర్తి యెక్కడ వుంటాయి?

దైవమిచ్చిన మిత్రుడు యెవరు?

స్వర్గానికి వెళ్ళకపోవడానికి కారణం యేమిటి?

తపస్సు, దమం, ఓర్పు, సిగ్గు అంటే ఏమిటి? జయింపరాని శత్రువు, అంతము లేని వ్యాధి ఏవి?

మోహం, మౌనం, ఆలస్యం అంటే యేమిటి?

పండితుడు, నాస్తికుడు, మూర్ఖుడు అంటే యెవరు?

బ్రాహ్మణుడు అంటే యెవరు?

వగైరా ప్రశ్నలన్నింటికి ఇందులో సమాధానాలు ఉన్నాయి...

Write a review

Note: HTML is not translated!
Bad           Good