ఇందులో...

మహాభారతంలో కీలకఘట్టాల రసవత్కథనంతోపాటు,

''యక్ష ప్రశ్నలు, చమత్కార ప్రశ్నలు, పొడుపు కథలు కానే కాదు,

తాత్త్వికత వాటి హృదయం'' అని -

ధర్మవ్యాధుడి కథ ''మానవుడు ప్రాకృత స్థితి నుంచి

సంస్కృతీకరణ పొంది బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం'' అని -

సైంధవఘట్టంలో ''స్త్రీ సౌందర్యాన్ని ఎలా దర్శించాలో మానవుడు

ఇంకా నేర్వని విద్య'' అని -

సావిత్రి కథలో ''యముడు మహాతాత్త్విక విషయం'' అని -

కీచకవధలో ''కాముకతని, స్త్రీ పురుష సంబంధాల ప్రకృతి వికృతులని -

రాయబారం సమీక్షలో ''మానవనిర్మాణం కళని శ్రీకృష్ణుడు సాధించిన విధాన్ని -

ఇదే మార్గంలో అంబ దయనీయ కథ వంటి మరి కొన్నింటిని,

పాత్రల మానసిక అధ్యయనంతో రచయిత అక్షరీకరించారు.

మనస్సుని సంపన్నం చేసే ఉత్తమ గ్రంథం ఇది.

- మహీధర

Write a review

Note: HTML is not translated!
Bad           Good