విదేశీ పరిపాలనకు వ్యతిరేకంగా మనం సాగించిన స్వాతంత్య్రపు పోరాటం నాటి సంకల్పం లాంటిదే మరొక ధృఢ సంకల్పం మనకు ఇప్పుడు అవసరమని నేను భావిస్తున్నాను. ఆనాడు జాతీయ భావం చాలా బలంగా వుండేది. అలాగే భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలనే ఈ ద్వితీయ సంకల్పానికి మరోసారి జాతీయ భావం ఆవశ్యకతమౌతుంది.

అభివృద్ధి ఫలాలు రుచి చవి చూచిన భారతీయులు అవి మరింత ఎక్కువగా కావాలని ఉవ్విల్ళూరు తున్నారు - మరింతగా విద్య, మరిన్ని అవకాశాలు, ఇతోధికంగా అభివృద్ధి, సుసంపన్నమూ, సుసంఘటితమూ అయిన భారతదేశం కోసం వారు కనే కలలను దారుణంగా చెదర గొట్టగల ప్రమాదాలు కూడ ప్రక్కనే పొంచి వున్నాయి. సంఘీ భావాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాల భూతం ఒక వంక, పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు ఇంకొకవంక, దేశం లోపలా, సరిహద్దులోనూ రోజు రోజుకీ పెరుగుతున్న అశాంతి, ఉగ్రవాదం మరొక వంక, దేశాన్ని నిర్వీర్యం చేసి 'ఏకజాతి' భావనకే భంగం కల్గించేట్లుగా తయారైనాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశపు మౌలిక తత్వాన్ని, సార్వభౌమత్వాన్నీ పరిరక్షించుకునేదెలా? అభివృద్ధిని సాధించెదెలా?

పై ఆశలకూ, ఆందోళనలకూ కొంతైనా పరిష్కారం చూపగల మహోన్నత వ్యక్తి డాక్టరు కలాంగారు. ఏ జాతికైనా జీవనాడి ఆ దేశ పౌరుడే. దేశంలో ప్రతి పౌరుడూ తన విద్యుక్త ధర్మాన్నీ, బాధ్యతనీ సక్రమంగా నిర్వర్తించి విజయం సాధించిన నాడే ఆ దేశం కూడా విజేత అవుతుందని ఆయన విశ్వాసం. ''ప్రగతి పథంలో భారతదేశం'' ఆచరణ సాధ్యమైన ఆదర్శాల సమామారం. వ్యక్తి స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ ప్రగతి సుసాధ్యం అనేదే దీని సందేశం. కావలసిందల్లా - ''ఒక వ్యక్తి కంటె, సంస్థ కంటె, జాతి గొప్పది'' అనే సూత్రానికి కట్టుబడటం, ''అవధులు లేని మేధస్సులే అంతరాలు లేని సమాజాన్ని స్థాపించగలవు.'' అనే అవగాహన! మాత్రమే.

Pages : 77

Write a review

Note: HTML is not translated!
Bad           Good