స్వాతంత్య్రం కోసం రెండు రకాల పద్ధతులు ప్రజల చేత ఉపయోగించ బడతాయి. మొదటిది ఆయుధాలతో కూడిన తిరుగుబాటు. అధికారులను, ప్రభువులను హింసాత్మకంగా దెబ్బతీయటం. రెండవది అహింసతో కూడిన సహాయ నిరాకరణ అంటే తమ తోడ్పాటును అందించకుండా, అధికారాన్ని తిరస్కరిస్తూ, ఇంకో వైపు దాని వలన వచ్చే పరిణామాలను సంతోషంగా ఎదుర్కోవటం. దాని వల్ల ప్రభువు లేదా అధికారి తన అధికారం వదులోక తప్పదని అర్థం చేసుకుంటాడు. ఆయుధాలు లేని భారతీయులు మొదటి పద్ధతి ద్వారా బ్రిటీష్‌ వారి నుండి స్వాతంత్య్రాన్ని పొందే స్థితిలో లేరు, తమ వద్ద సైనిక సామాగ్రి మరియు ఇతర ఆయుధాలు లేవు కనుక రెండో దానితో సాయుధ దళాలను సులభంగా అణిచివేయవచ్చు. ఇంకో వైపు రాజ్యాంగ బద్ధమైన ఆందోళన ఫలితాన్ని ఇవ్వటానికి తీవ్ర జాప్యం కలగ చేయటమే కాక అధికారులు దాన్ని తీవ్రంగా పరిగణించక పోవచ్చు. ఎందుకంటే ఇది సమర్థవంతమైనదిగా పరిగణింపబడలేదు. కానీ రెండవది స్వేచ్ఛ కోసం చేసి డిమాండ్‌ ని గుర్తించటమే కాక, అధికారం విడిచిపెట్టమని స్వచ్ఛందంగా చెప్పకనే చెప్తుంది....

పేజీలు : 253

Write a review

Note: HTML is not translated!
Bad           Good