భారతదేశం-నిరుద్యోగం అనే ఈ పుస్తకం సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా, వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వుంది. ఈ నిరుద్యోగంపై అనేక రచనలు వచ్చినప్పటికీ ఎవరూ విశేషణాత్మకంగా లోతైన పరిష్కారాలవైపు వెళ్ళలేదు. ఈ సమస్య ముఖ్యంగా యువతలో, అందులోనూ చదువుకున్న యువతలో అధికంగా వుంది. శాస్త్ర, సాంకేతిక విప్లవం ద్వారా ఉత్పత్తిలో పెనుమార్పులు సంభవించాయి. తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి, సేవల రంగాల్లో అనేక కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. సమాచార పంపిణీ, మార్కెట్టుల వల్ల ప్రపంచం వినూత్నతను సంతరించుకుంటోంది. ఎలక్ట్రానిక్స్‌ మీడియా, విశ్వవిద్యాలయాలు, విజ్ఞానపు స్వరూప స్వభావాల్ని మార్చివేశాయి. అయితే ఆశించిన నూతన ప్రపంచంలో మానవ హక్కులు, గౌరవనీయమైన ఉపాధి కొరవడింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉపాధి రంగం వేగంగా క్షీణిస్తోంది.

    పుస్తక రచయిత విజయకుమార్‌ సంక్లిష్టమైన ఈ నిరుద్యోగ సమస్యను లోతుగా పరిశీలించి, అధ్యయనం చేశారు. సమస్యకు గల మూలాల్ని, కారణాల్ని, పరిష్కారాన్ని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల విధానాల్ని వివ్లేషించారు. ప్రభుత్వ విధానాలు, సామాజిక వ్యవస్థల మధ్య ఉన్న వైరుధ్యాల్ని వివరించారు.

    విజయ్‌ కుమార్‌ ఈ నిరుద్యోగ సమస్య తీవ్రతను సమర్థవంతంగా ఈ పుస్తకంలో పొందు పరిచారు. యువత ఎదుర్కోంటున్న సమస్యను గురించిన విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదకారిగా వుంటుంది. అదేవిధంగా సరైన కోణంలో పరిష్కారాల్ని వెతుక్కోడానికి ఈ పుస్తకం మార్గదర్శిగా ఉపయోగపడుతోంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good