దేశ రాజకీయాల్లో మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. దేశానికి ఒక రూపు ఇవ్వడంలో చట్టసభల్లని మహిళలు చేసిన కృషి ఆమోఘం. రాజకీయాలలో మహిళలు కొంతవరకే వున్నారు. ఉన్నంతలో వారు పని చేస్తున్నారు. అయితే జనాభాలో సగభాగమున్న మహిళలు మరింత ముందుకు రావాల్సిన ఆవశ్యకత వుంది. ఇందుకు మహిలల ప్రోత్సాహం కోసం ఆధారపడకుండా ఒకింత ధైర్యంతో ముందడుగు వేయాల్సిన అవసరముందని భావిస్తున్నాను. తద్వారా మగవారిలో కూడా ఒక చలనం కలుగుతుంది. మహిళలకు దక్కాల్సిన వాటా గురించి ఆలోచించడానికి అంతో ఇంతో ఆస్కారముంటుందని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు రాజకీయాలలో వున్న మహిళలు భావితరాలకి ఒక ''రోల్‌ మోడల్‌''గా నిలిచారు. అంతేకాదు. మహిళా గవర్నర్లుగా కూడా రాణించారు. ఎన్నో మంచి విధానాలను తీసుకొచ్చారు. ఈ విధానాల ద్వారా సమాజం ఎంతో వృద్ధి చెందింది. ముఖ్యంగా మహిళాభివృద్ధి గతంలో కంటే శరవేగంగా జరిగిందనే చెప్పాలి. మహిళలు ఏ రంగంలో వున్నా, ఆ రంగాన్ని విజయపంథాలో నడిపించడానికి కృషి చేశారు. ఈ విషయమే అనేక సర్వేల్లో కూడా తేటతెల్లమైంది. అంతేకాదు, ఇదే విషయాన్ని డా|| షేక్‌ హసీన రాసిన ''భారతదేశం - మహిళా గవర్నర్లు'' పుస్తకంలో స్పష్టం చేశారు......

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good