....సమాజంలో, ఆర్ధిక రంగంలో వచ్చిన పరిణామాలను వివరించటం ఈ గ్రంథంలోని ప్రత్యేకత. భారతదేశ చరిత్ర రచనలో ఇదివరలో వచ్చిన వ్యాఖ్యానాలు ఎలా మారాయో చెప్పి కొత్త అధ్యయానాలను కొత్త ప్రశ్నలను మీ ముందుంచే గ్రంథం ఇది.
ప్రసిద్ధ చరిత్రకారిణి రోమిలా థాపర్‌ చరిత్ర రచన ఎలా రూపొందినదో పరిచయం చేయటమే కాదు, ప్రత్యేకతలు కోరుకునే ఈనాటి అసహన హిందూ జాతీయ వాదులు ఆధారపడిన చరిత్ర కల్పననీ, ఆవిష్కరణలనీ నిర్మూలించారు. ఈ నాటి పాఠకులు తప్పకుండా పఠించాల్సిన పుస్తకం.'' - ఎరిక్‌ హాబ్స్‌బామ్‌
రొమిలా థాపర్‌కి పండితుల మేథోమథనంతో బాటు సామాన్య పాఠకులను ఆకట్టుకునే శైలీస్పష్టత ఉంది. భారతీయుల గతం గురించి ప్రచారంలో గల విశృంఖల నిశ్చిత ఉద్దేశాలను తర్కబద్ధంగా ఖండిస్తూ ఓపికతో ప్రశాంతంగా నచ్చచెప్పారు. అదే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. డేవిడ్‌ ఆర్నాల్డ్‌, టైమ్స్‌ లిటరరీ సప్లిమెంట్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good