ఆర్థిక విషయాలపై తెలుగులో పుస్తకాలు వెలువడటమే అరుదు. వర్తమాన ఆర్థీక అంశాలపై కొన్ని వెలువడు తున్నప్పటికీ ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ చారిత్రక పరిణామాన్ని వివరించి వర్తమాన పరిస్థితిని సరైన విధంగా అవగతం చేసుకోవడానికి దోహదపడే పుస్తకాలు బహు అరుడు. అలాంటి ఓ పుస్తకం ఇది. తొలుత 1999లోనే ఇది ప్రచురించబడింది. అప్పటికి దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో అమలవుతున్న సరళీకృత నయాఉదరవాద ఆర్థిక విధానాల తీరుతెన్నులను అది వివరించింది. తర్వాత ఈ దశాబ్ద కాలంలో ఆ విధానాలు మరింత ముదిరి పోయాయి. వాటి విషఫలితాలు కూడా తీవ్రమయ్యాయి. ఆ అంశాలను కూడ వివరించి తాజాపరచిన గ్రంథం ఇది.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good