భారతదేశానికి కేవలం వ్యాపారం చేసుకునేందుకు వచ్చారు కొద్దిమంది బ్రిటీషువాళ్లు. సువిశాలమైన మనదేశాన్ని వాళ్లు సులభంగా హస్తగతం చేసుకొని భారతీయుల్ని బానిసత్వంలోకి నెట్టగలిగారు. అదెలా జరిగింది?

    దేశ శ్రేయస్సును కాని, ప్రజాశ్రేయస్సునికాని పట్టించుకోని స్వార్థపరులైన రాజులు పరదేశీయుల్ని ఆహ్వానించి, వారి సహాయంతో ఇతర దేశీయ రాజుల్ని హతమార్చి దేశ స్వాతంత్య్రాన్ని పరాయివారి పాలనకు అప్పగించారు.

    అజ్ఞానులైన ప్రజల నిస్సహాయత, నిరక్షరాస్యత, మూఢాచారాలు, కులమత సంబంధమైన ఉన్మాదం ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేశాయి.

    ఈ పరిస్థితులను గ్రహించి తెలివిగా తమ శక్తియుక్తులతో దేశీయరాజుల్ని ఒక్కొక్కర్ని నయానా, భయానా లొంగదీసుకొని, హతమార్చి ఆంగ్లేయులు దేశాన్ని హస్తగతం చేసుకొన్నారు. బ్రిటీషు సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశంలో రకరకాల వ్యాపారాలు చేస్తూ వర్తకుల్ని, రైతుల్ని, వృత్తికార్మికుల్ని దోచుకున్నారు. మన దేశ సంపదను దోపిడీ చేసి తమ దేశానికి తరలించుకెళ్ళారు. సామాన్యప్రజలు చాలినంత తిండి, గుడ్డ, ఇండ్లు లేక అనేక కష్టాలు పడ్డారు.

    చివరకు భగత్‌సింగ్‌, లాలాలజపతిరాయ్‌, గోఖలే, తిలక్‌, నెహ్రూ, మహమ్మదాలీ, షౌకత్‌అలీ, మహాత్మాగాంధీ, సుభాస్‌ చంద్రబోస్‌ మొదలైన ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల అహింసాయుతంగా మన దేశానికి స్వాతంత్య్రం లభించింది.

    చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తి పెంపొందటానికి, స్ఫూర్తి పొందటానికి, కొత్త చైతన్యం కలగటానికి మనదేశ చరిత్రను పిల్లల చేత పదే పదే చదివింపజేయాలి. ఉన్నతశ్రేణి పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి. అందుకోసమే ఈ చిన్న పుస్తకం. చదవండి! చదివింపజేయండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good