భారత రాజ్యాగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ మౌలిక ఆధారాలతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలనూ, ప్రేరణలనూ, దూరదృష్టినీ కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యా వ్యక్తీకరణలో, అవసరమైన పాలన వ్యసవ్ధల రూపకల్పనలో వారు ఏమేరకు విజయం సాదఙంచారో విశ్లేషించారు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహం చేస్తుందో, ఒక ఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూలసూత్రాల్లో ప్రస్తుత, భవిష్యత్‌ సమస్యలకు పరిష్కార మార్గాలు వున్నాయని రచయిత చెప్పారు. రాజ్యాంగం సరిగా పనిచేయలేదనడం కేవలనం అపోహ మాత్రమే అని సూచించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good