భారత రాజ్యాంగం యొక్క వర్గ స్వభావం,

భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమేనా?

రాజ్యాంగాన్ని రాజకీయం శాసిస్తున్నదా, లేక రాజకీయాన్ని రాజ్యాంగం శాసిస్తున్నదా?

రాజకీయం చుట్టూ రాజ్యాంగం పరిభ్రమిస్తున్నదా, లేక రాజ్యాంగం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్నదా?

రాజ్యాంగంంపై రాజకీయ పార్టీల ప్రభావం,

న్యాయవ్యవస్థ వర్గ దృక్పధం తదితర అంశాలపై పాఠకులను ఆలోచింపజేసే విమర్శనాత్మక, విశ్లేషణాత్మక వ్యాఖ్యానం ఈ 'భారత రాజ్యాంగము' గ్రంథము.


    గత 68 సంవత్సరాల కాలంలో మన రాజ్యాంగం 100 సార్లు సవరించబడింది. ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసేందుకు, బడుగు, బలహీనుల సంక్షేమం కోసం, స్వతంత్ర ఫలాలు సామాన్యుడికి దక్కాలన్న ఏకైక లక్ష్యంతో ఇన్ని రాజ్యాంగ సవరణలు చేసినట్లు పాలకులు చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి? మనందరికీ తెలుసు. మనదేశంలో ప్రజాస్వామ్య మూలాలు బలహీన పడినట్లు, ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడినట్లు మేధావులు, సామాజిక వేత్తలు పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన రాజకీయ నాయకులు కూడా తెలిసో, తెలియకో నోరుజారి అప్పుడప్పుడు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు కూడా. ఆర్థిక అసమానతలు విస్తరిస్తున్నాయి. బాలలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి, ఆశ్రిత పక్షపాతం. అన్న దాతల ఆత్మహత్యలు. మానవత్వం మృగ్యం అవుతున్నది. ఒక రకంగా మొత్తం సామాజిక వ్యవస్థ గాడితప్పి తిరోగమిస్తున్నది. 

లోపం ఎక్కడ ఉన్నది? కేవలం రాజ్యాంగాన్ని చదవటం కాకుండా, రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.


Write a review

Note: HTML is not translated!
Bad           Good