భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 350 నుంచి క్రీ.పూ. 185 వరకు గడచిన కాలాన్ని ఈ పరిశోధనక గ్రంథం మన కళ్ళ ముందుంచుతుంది. అలెగ్జాండర్‌ దండయాత్రను, ఆ తర్వాతి మౌర్య సామ్రాజ్య చరిత్రను ఇది వివరిస్తుంది. అశోకుని శాసనాలను, వాటి ప్రాముఖ్యతను వెల్లడించే సవివరమైన అధ్యయనాన్ని మనకు అందిస్తుంది. శాసనాలు, లిపులు, పురావస్తు..ఇలా అందుబాటులో ఉన్న పలు మూల వనరులను ఆధారంగా చేసుకుని ఆ కాలపు ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను పునర్‌నిర్మించింది. మౌర్యుల చరిత్ర క్రమంపై, అర్థశాస్త్ర రచనాకాలం, అశోక ప్రాకృతం ఇత్యాది అంశాలపై రచయితల ప్రత్యేక వివరణలు చేర్చారు., భారతీయ, గ్రీకు మూల గ్రంథాలు, శాసనాల నుంచి స్వీకరించి ఇచ్చిన దాదాపు 15 ఉటంకింపులు మరిన్ని వివరాలు కావాలని కోరుకునే పాఠకుల జిజ్ఞాసను తీర్చగలవు. వీటితోపాటు తొమ్మిది మ్యాపులు, 20 చిత్రాలు చేర్చి రచయితలు ఈ గ్రంథాన్ని కొంత సుదీర్ఘంగానే అందించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good