భారతదేశం చరిత్రలో క్రీ.పూ. 700 నుంచి 350 వరకు నడచిన అత్యంత ప్రధానమైన దశ గురించి యీ పరిశోధన గ్రంథం వివరిస్తుంది. ఈ దశలో ఇనుమకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి చెందింది. పనిముట్లు రూపుమార్చుకుని బహుళమయ్యాయి. నగరాలు తలయెత్తాయి. వాణిజ్యం విస్తరించింది; సైనిక దళాలతోనూ, ఉన్నతాధికార వర్గంతోనూ కూడుకున్న బలమైన రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. జైన, బౌద్ధాలు నిజమైన అర్థంలో మత విప్లవాన్ని తీసుకువచ్చాయి. ఈ మొత్తం గురించి నాలుగు అధ్యాయాల్లో స్పష్టమైన, అరమరికలు లేని చిత్రణ ఉన్నది. వివాదాస్పద అంశాలను మరుగుపరిచే ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పంచ్‌ మార్క్‌ నాణెముల యుగం, ఉత్తరాది నలుపు మెరుగు పాత్రలు, కాలక్రమణిక సమస్యలు, లిపి ఆవిర్భావంల గురించి ప్రత్యేక వివరాలు వున్నాయి. ఆకరాల నుంచి యిచ్చిన తొమ్మిది ఉటంకింపులు పాఠకునికి మూల గ్రంథాలను హృదయానికి దగ్గర చేస్తాయి. దీనిలో పన్నెండు చిత్రాలు, ఏడు పటాలు, గ్రంథాంతమున కాల క్రమణిక పట్టిక కలదు. ప్రతి అధ్యయనం చివరన ఉపయుక్త గ్రంథాల జాబితా వున్నది. ఆధార గ్రంథాలతోపాటు, చదవదగ్గ గ్రంథాల వివరాలు కూడా ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good