ఇప్పుడు మీ చేతిలో ఉన్న 'చరిత్ర పూర్వయుగం' భారతదేశంలో మానవజాతి తొట్టతొలి దశ , ఎలాంటి వ్రాతపూర్వక ఆధారాలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగాని కాని లభించడానికి ఎంతో ముందు కాలం గురించిన దశను వివరిస్తుంది. 'భారత ప్రజల చరిత్ర' అనే ఒక బృహత్తర ప్రాజెక్టులో ఇది భాగం. అయినప్పటికీ దీనంతట ఇదే స్వతంత్ర రచనగా కూడ ఉంటుంది. మొదటి అధ్యాయం, భారతదేశంలో నైసర్గిక స్వరూపం రూపుదిద్దుకోవడం గురించి, వాతావరణం, ప్రకృతి పరిసరాలు (వృక్షాలు, జంతుజాలం) గురించి - మన చరిత్ర పూర్వదశను, చరిత్రను తెలుసుకోవడానికి అవసరమైనంత మేరకు చెబుతుంది. |