ఇరవై సంవత్సరాలు స్వతంత్ర భారతి ప్రజాస్వామ్య విధానాల గాడి లోనే నడుస్తున్నదని భావించటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇరుగు పొరుగు దేశాలు ఇంకా విధానాల అరణ్యంలో దారి తెలీక తడబడుతుంటే మన విశాల భారత దేశం ఆరకమైన అవస్తల పాలు కాకుండా నడయాడటం ఈ దేశ ప్రజల అదృష్టమే కాదు. ఈ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల ప్రజ్ఞ కూడా. దేశాన్ని శాంతియుతంగా పాలించటంలో ప్రధాన మంత్రిదే మొత్తం బాధ్యత గదా. అరవై సంవత్సరాలు నిండిన స్వతంత్రదిన సమారోహణలో మనలను మనం అంచనా వేసుకోనటం అవసరం. అందుకే ఇప్పటి వరకు మన దేశానికి ప్రధానులుగా పదవీ - బాధ్యతలను నిర్వహించిన మహానాయకులు అందరి విశేష ప్రజ్ఞ ను నేటి కాలపు వారు తెలుసుకొనుట ఆవశ్యకం అని భావించబడింది. కాబట్టే ఆదారిలో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇది. మన ప్రధానులు జీవిత చరిత్రలను, వారు తమ పదవీ కాలంలో నిర్వహించిన కర్తవ్యాలను సూచన ప్రాయంగా ఈ పుస్తకంలో తెలియ చేయటం జరిగింది. ఇది కొండ అద్దమందు కొంచమైన ఉండదా ! అనే విధంగా చేసిన రచన. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good