నీ ఆత్మకి నువ్వు బాధ్యత వహించరా,

నిన్ను నువ్వు అవమానించుకోకురా.

నిన్ను నువ్వు హింసించుకున్నట్టు,

అవహేళన చేసుకున్నట్టు,

నిన్ను నువ్వే ముక్కలుగా నరుక్కున్నట్టు,

నీ పరమ శత్రువైనా..

నిన్ను ధ్వంసం చెయ్యలేడురా.

అల్పత్వంతో జీవితం సరిపెట్టుకోకు,

శుభాన్ని ఆలోచించు, భయాన్ని కాదు.

నీ గుండెలో భయమే అసలు శత్రువురా,

భయం నీ గుండెని నిత్య రణక్షేత్రం చేసింది.

నీతో నిన్నే పోరించి, ఓడించి నవ్వింది.

తుమ్మికి కొరవిలా ముహూర్తమైనా మండిపో,

ఊకలో పడ్డ నిప్పులా ఊరక పొగలు చిమ్మకు.

పౌరుషాగ్నివి కాక,

చితాగ్నిలాంటి నీ బతుకెందుకు..?

ఎవడి నడవడిని బలే అని పండితులు మెచ్చరో..

వాడు జనగణనలో అంకెగా నిలుస్తాడు.

నిన్నెలా కొడుకుగా కన్నానురా,

నీలో జిగీష లేదు, జిజ్ఞాస లేదు,

ఉత్సవం లేదు, ఉత్సాహం లేదు,

ఆగ్రహం లేదు, అనుగ్రహం లేదు.

కత్తి పట్టలేకపోవడం కరుణ అనిపించుకోదు.అమ్మా! నాకు నాలోని సంపద చూపించావు

ఇక భయానికి తావు లేదు, జయం సాధిస్తాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good