'ప్రతిదేశ విప్లవ గమనంలో విప్లవకారులు పాలక వర్గాల తుపాకి గుండ్లకు బలి అయ్యారు. ఉరికంబాలెక్కారు. దీర్ఘకాల జైళ్ళ జీవితాన్ని అనుభవించారు. జైళ్ళలో అనేక దౌర్జన్యాలకు, హింసాకాండకు, కాల్పులకు గురయ్యారు. ఇదంతా విప్లవకారుల జీవితంలో ఒక భాగమే. భారత విప్లవకారులు కూడా ఇవన్నీ ఇంతకు పూర్వం అనుభవించార. వారి అడుగు జాడల్లో నడుస్తూ మేము కూడా వీటిని మా జీవితంలో ఒక భాగంగా మాత్రమే పరిగణిస్తున్నాము''

''భారత విప్లవం భారత ప్రజల జన్మహక్కు. ఈ విప్లవం కోసం పనిచేయడం విప్లవకారుల జన్మహక్కు. ఈ జన్మహక్కును ఏ రాజ్యాంగమూ, ఏ చట్టమూ పాలక వర్గాల లక్షలాది సాయుధ బలాల పాశవిక నిర్బంధ విధాననమూ హరించజాలదు. అణచివేయజాలదు. భారత విప్లవం జయంచి తీరుతుంది. ప్రపంచ విప్లవ గమనం సూచిస్తున్నది ఇదే. - కామ్రేడ్‌ దేవులపల్లి వెంకటేశ్వరరావు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good