భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర సంగ్రహంగా నైనప్పటికీ ఆది నుండి నేటి వరకూ ప్రామాణికంగా రచించబడిన మొట్ట మొదటి గ్రంథమిదే. దానిని రచించిన భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ మన దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఆరు దశాబ్దాలకు పైగా పనిచేస్తూ వచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకులలో కలిసి పనిచేసిన అనుభవం ఉండి ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమలోనూ ఆ తరువాత సి.పి.ఐ ( ఎం) లోనూ ప్రముఖ పాత్రను నిర్వహించిన విప్లవకారుడాయన. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను రూపొందించడంలో ఆయనకు ప్రముఖ పాత్ర ఉంది. అందుకే ప్రామాణికతను సంతరించుకున్న గ్రంథమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good