ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోనూ మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి. ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన...ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్ధులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది. - ఎ.ఎల్‌.బాషామ్‌
చరిత్ర అధ్యయనంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు కోసంబి. ఆధునిక గణిత శాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ, నాణాల బరువును బట్టి అవి ఎంతకాలంగా చలామణిలో ఉన్నాయో నిర్థారించడమే కాదు - ఆయా కాలాలకు సంబంధించిన వివరాలను రాబట్టే దారి చూపారు. - జె.డి.బెర్నాల్‌
కోసంబి అనుసరించిన విశ్లేషణా పద్ధతుల్లో చాలా భాగం - యాభై ఏళ్ళ తర్వాత, ఇప్పటికే అంతే ప్రభావవంతంగా, అంతే ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మిగిలిన ఆ కొద్ధి భాగం విషయంలో కూడా పునరాలోచన అవసరమవుతోందంటే అది - కొత్త ఆధారాలు వెలుగులోకి రావడం వల్లనో, సరికొత్త వివరణాత్మక సిద్ధాంతాల వల్లనో, లేక గతాన్ని గురించిన మన దృక్పథాల్లో మార్పు రావడం వల్లనో మరేమీ కాదు. కోసంబి రచనలు మళ్ళీ మళ్ళీ చదవడం అవసరం. చదివిన ప్రతిసారీ సంభ్రమానికి గురిచేస్తూ మనల్ని మరింత చారిత్రకంగా ఆలోచించేలా ఆలోచించేలా ప్రేరేపించడం వాటి విశిష్టత. - రోమిలా థాపర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good