మానవత్వానికి పెద్దపీట
'భూమ్మీద లెక్కల్లో రెండుని రెండుతో గుణిస్తే నాలుగే అవుతంది. కానీ భగవంతుని లెక్కల్లో దేన్ని ఎంత పెట్టి గుణిస్తే ఎంతవుతుందో తెలీదు' అంటూ వ్యక్తుల మంచితనం జీవితంలో లాభిస్తుందని తెలియజెప్పే కథలు ఈ సంకలనంలో చాలానే ఉన్నాయి. 'నిష్కామ కామయ్య, మానవుడు - మాధవుడు, జగమెల్లను సుధా దృష్టిచే, మూర్తీభవించిన త్యాగశీలి..'తదితర కథల్లో నిస్వార్ధపరులైన వ్యక్తులు కనిపించే మానవత్వంపైన మమకారాన్ని పెంచుతారు.
'ధర్మరాజు మెత్తని పులి! స్నేహం కూడా మిథ్యే, కాత్యాయనీ! రమాపతి సోదరీ!' కథల్లో స్వార్ధపరుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. ఇతివృత్తంలోనూ వైవిధ్యంగా సాగుతాయి. మొత్తం మీద భమిడిపాటి సోమయాజి మూడో సంకలనం గుర్తుండిపోయే అంశాలతో కథాప్రియుల్ని అలరిస్తుంది.-పార్ధ

Write a review

Note: HTML is not translated!
Bad           Good