సాక్షాత్‌ నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుని విరచితాలైన ఈ అష్టాదశ పురాణాలు, మనకు యుగాల తరబడి అందుతూ వస్తున్న విజ్ఞాన సర్వస్వాలు, అమృత భాండాలు.
సృష్టిలో ఎన్ని రీతులున్నాయో - ఎన్ని రమణీయ సన్నివేశాలున్నాయో అవన్నీ మన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. భారతీయ సంస్కృతికీ, తరతరాల ఇతిహాస ప్రవాహానికీ పెన్నిధిగా నిల్చిన ఈ 18 పురాణాలలోను లేనిదంటూ ఏదీ లేదు.
ఈనాడు...అత్యాధునికంగా మానవుడు కనుగొంటున్నట్టుగా భావించబడుతున్న పరిశోధనలకు మూలాలు పురాణాల్లో నిక్షిప్తమై ఉన్నాయనడం అతిశయోక్తికాదు.
ఇంతటి విద్వత్తూ - మహత్తూ ఉన్న ఈ 18 పురాణాలను సరళవచనంలో సారసంగ్రహంగా, సంక్షిప్త రూప విజ్ఞాన సర్వస్వంగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అఖిలాంధ్ర పాఠక లోకానికి అందించ గల్గుతున్నందుకు ఆనందిస్తున్నాం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good