భారతీయ సంస్కృతీ ప్రవాహం నిరంతరంగా కొనసాగడానికి సంస్కృత భాష అతి ముఖ్య మాధ్యమంగా దోహదపడుతున్నది. ఇది ఆధునిక భారత రాజ్యాంగంలోని 8వ ప్రకరణంలో ఒక భాషగా నమోదు అయింది. సంస్కృత భాషా పరిచయం ప్రతివారికీ ప్రయోజనకరమే. అందుకు ఈ ద్విభాషా నిఘంటువు ఉపయోగపడుతుంది. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని 7 వేలకు పైగా పదాలు, ధాతువులు, ఆకర్షణీయమైన చిత్రాలతో ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకున్నది ఈ శబ్దకోశం.

తెలుగు రాష్ట్రాలలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్న లక్షలాదిమందికి ఇది లాభదాయకం. సంస్కృతం, తెలుగు భాషలను కంప్యూటరులో కూర్చగల మెళకువలు కూడా ఇందులో ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good