శ్రీమద్ భగవద్గీతను ఆదిశంకరుల నుండి, ఆధునికుల వరకు అనేకులు అనేక కోణముల నుండి, అధ్యయనము చేసి, విశ్లేషించి, వందలాది భాష్యములను రచించి యుంటిరి. భారతీయ భాషలలోనే కాకుండా, విదేశీ భాషలలో కూడాను వ్యాఖ్యానములు వెలసినవి. శతాబ్దాలుగా తరతరాల నుండి, దేశ విదేశీయులైన మేధావులనాకర్షించి ఆలోచింప జేసి, వారి ప్రశంసలను పొందిన గ్రంథరాజు మీ భగవద్గీత.
వేదాంతసారమైన ఈ గీతాశాస్త్రము ఆధునిక విద్యా ప్రభావితులైన నేటితరము వారికి సుగ్రాహ్యము కానందున ఈ మహత్తర జ్ఞానము, వారికి దూరముగానే ఉండిపోయినది.
నిగూఢమైన వేదాంత విషయములను సాధ్యమైనంత వరకు అందరికిని సులభ గ్రాహ్యముగ నుండుటకు, సమకాలిక జీవన విధానమునకు సన్నిహితముగను, వ్యావహారిక భాషా శైలిలోను, ఈ గ్రంథమును రూపొందించడమైనది.
మానవ జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షప్రాప్తి (జన్మ రాహిత్యము) కొఱకు నిర్దేశింపబడిన సాధన మార్గములను, మోక్ష శాస్త్రమైన భగవద్గీత యందు భగవానుడు వివరించెను. కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గములు వేర్వేఱుగా చెప్పబడినను, అనుష్ఠాన దశయందు అవి అన్నియును పరస్పర సహాయకములై సంయుక్తంగా నభ్యసింపబడి పరిపక్వ దశ యందు జ్ఞానముగ పరిణమించును.
ఈ గ్రంథము గీతతో పూర్వ పరిచయము లేని ఆధునికులకు ప్రయోజనకరముగా నుండగలదను ఆశతో ఈ ప్రయత్నం చేయబడినది.
Pages : 504