భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరానకూర్చున్నవ్యాసునికి నారదుడు బోధించిన గాయత్రీ బీజాక్షర ముద్రితం భాగవతం. ఈ భగవతాన్ని సరళ వ్యావహారికంలో అందించారు. ప్రముఖ రచయిత జగన్నాథశర్మ. నవ్యవిక్లిలో సంవత్సరానికి పైగా వెలువడి, విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన గొప్ప రచన ఇది. దీనిని చదివితే మనసుకు శాంతి, ప్రశాంతిలభిస్తాయి. అనుకొన్నవి సాధిస్తారు.  ---జగన్నాథ శర్మ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good