కళ్లులేని గురివింద తీగెకి

పట్టుకొమ్మ దొరికేందుకు

కస్తూరి పూలపరిమళం తోవచూపిందా?


తన పూలగర్భాల్లోకి దూరి

మకరందాన్ని తాగే తేటి రొమ్ముకొలత

తంగేటిచెట్టుకి ఎన్నడో తెలుసా?

నడి ఎండలో చేతులు జాచి

నాట్యంచేసే కొబ్బరిచెట్టుకి

తన ఎత్తునించి వూడిపడే పాపని కాపాడ్డానికి

పీచుదిళ్ల చొక్కాలల్లడం ఎవరు నేర్పారు?

గర్భంలోని శివువులో

ఏ అవయవాలు ఎక్కడ ఏర్పడాలో

కన్నతల్లి కలగన్నదా?

వార్ధి గడ్డకట్టినా

మంచు బరువెక్కకుండా

తన జీవనంకోసం

సృష్టిజలసూత్రాన్నే మార్చింది

చాపేనా!

పేజీలు : 107

Write a review

Note: HTML is not translated!
Bad           Good