పడునాల్గు పుటల విస్తృతి గల వ్యాసంలో రచయిత భగవద్గీతలోని భౌతికవాద అంశాలను అంశీభూతం కావించారు. దానికి అనుపానంగా, గ్రంథకర్త గురించి, గ్రంథ రచనాకాలం గురించి, నాటి భౌతికవాదులపై దూషణ గురించి వివరిస్తూ, చక్కని ఇంట్రోను సమకూర్చుకొన్నారు. వ్యాసాంశ చర్చను ఆరంభిస్తూ ఈ చర్చలో భగవద్గీతలోని భౌతికవాద, సానుకూల పార్శ్వాలను గుర్తించడమే కాకుండా, వాటిని తగు మోతాదులో వివరించారు కూడ.

    వేదాలను సున్నితంగా తిరస్కరిస్తూ ఆ కాలంలో ఉన్న బ్రాహ్మణాధిక్యాన్ని తూర్పారబట్టాడు. 'వేదజడత్వం లేని ఉదారవాది'గా శ్రీకృష్ణుడు, బ్రాహ్మణాధిక్యానికి ఆటపట్టయిన కులవ్యవస్థను విమర్శిస్తూ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది విభజన జన్మగతం కాదనీ...మనిషి స్వభావం, ప్రవృత్తి, ప్రకృతులను అనుసరించి వారు ఆచరించే కర్మానుసారం ఉంటుందని, వైదిక, బ్రాహ్మణ మతాలకు మధ్యేమార్గంగా తన నూతన సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తాడు శ్రీకృష్ణుడు. ''బుద్ధికి స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో పూర్తి స్వేచ్ఛ లేదు. కర్మను అనుసరించు, అదే సర్వస్వం అని భావించకు. క్రతువులను ఆచరించు, అదే సమయంలో వాటిని అధిగమించే ఎరుకను పెంచుకో. వేదాలను త్రోసిపుచ్చు, ఐనా అందులో ప్రయోజనకరమైన అంశాలను విస్మరించవద్దు. నిజమైన కర్మ, నిజమైన జ్ఞానం పరస్పర విరుద్ధమైనవి కావు...'' ఈవిధంగా శ్రీకృష్ణుడు తన నూతన మధ్యేమార్గ సిద్ధాంఆన్ని ప్రబోధించాడు.

    మధ్యేమార్గాన్ని అనుసరించకుండా శ్రీకృష్ణుడు వ్యతిరేక శక్తుల ఐక్యతా సూత్రాన్ని పాటించి ఉంటే, గీతాకారునిఆ వర్ణవ్యవస్థ పురోగతిని ఎంతో కొంత నిరోధించి ఉండేవాడు'' అన్న రచయిత వ్యాఖ్య గమనింపదగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good