'అస్పృశ్యత సామాజిక దురన్యాయంకాదా?'' ఈ ప్రశ్నకి ఆధారమే లేదు, యేమంటే ''సమాజం లాగే అస్పృశ్యతా యివాళ వుండి రేపు పోయేదే, మారుతూ వుంటుంది'' అని మనం అడిగిన దానికి జవాబు వచ్చిందనుకోండి, ఎవరైనా యేమనుకుంటారు? యుద్ధంలో చంపడం మహాపాపం అని అర్జునుడు బాధపడతాడు. కాని కృష్ణుడేమంటాడు? ''చంపడం వంటిది యెక్కడ వుంది? ఏమంటే ఆత్మకు చావులేదు!'' అని మరి అలాంటప్పుడు విలయకారకమైన యుద్ధంలో దిగడమెందుకు? అంటే అలా కాదు, ''నువ్వు నీ కర్తవ్యం నెరవేర్చాలి. నువ్వు చెయ్యవలసింది చంపడం, విజయం సాధించడం'' అంటాడు కృష్ణుడు. నీ కర్తవ్యం ఏమిటో, ఏ ప్రయోజనం కోసం దాన్ని చెయ్యాలో నిర్ణయించేది ఎవరు?

ఈ పద్ధతిలో గీతని, దాని ఉపదేశాన్ని నఖశిఖ పర్యంతం పరీక్ష చెయ్యాలి. ఎందుకనీ అంటే, ఆచరణకు రాని వొఠ్ఠి వాదోపవాదాల నిమిత్తంకాక, నిష్ఫలమైన హేతువులతో యిది ప్రజల మనస్సల్లో ముద్ర వేసుకుంది కనుక. మన సమకాలీన బౌద్ధిక, సాంస్కృతిక పరిపక్వతకు యీ కృషి చాలా ప్రాముఖ్యం వుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good