భగవద్గీత... పుట్టు పూర్వోత్తరాలు

మహాభారతం లోని భీష్మ పర్వము నందు 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు వున్న గ్రంథభాగం శ్రీమద్భగవద్గీతగా మన్నన పొందింది. మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి కాంచగా దాని సారమే భగవద్గీతగా పండితులు తెలిపారు. ఈ భగవద్గీతను వుపనిషత్తని, బ్రహ్మవిద్య యని, యోగ శాస్త్రమని కూడా కోవిదులు కొనియాడారు. రమారమి ఐదువేల సంవత్సరముల నాడు ద్వాపర యుగాంతమున కురుక్షేత్ర యుద్ధభమిలో అంకురించి, ఆకు తొడిగి, మొగ్గ వేసి, పుష్పించి ఫలించినదీ కర్మఫల వృక్షం. మానవ జాతికి ఒక వినూత్నమైన విభిన్నమైన కార్మిక జీవన విధానాన్ని భగవంతుడే నేరుగా అర్జునుని ద్వారా అందించారు. సకల కాలాలకు, సకల కులాలకు, సకల వృత్తులకు, సకల ప్రవృత్తులకు సరిపడు నూతన సమన్వయ జీవన విధానాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రబోధించారు. ఆ నాటి నుండి ఎందరో మహనీయులు, విజ్ఞులు గీతా ప్రశస్తిని, గీతా ఫలితాన్ని, గీతానుష్ఠానాన్ని పలు విధములుగా వర్ణించి యున్నారు. ప్రపంచంలో ఎనభైకి పైగా వివిధ భాషల లోనికి అనువదింపబడటం గీత సార్వజనీనతను, ప్రాశస్త్యాన్ని ప్రస్ఫుటం జేస్తున్నది. తెలుగులో కూడా పలు అనువాదాలు, వ్యాఖ్యానాలు అందుబాటులో వున్నాయి.

పేజీలు : 157

Write a review

Note: HTML is not translated!
Bad           Good