మన పూర్వీకులెవరో? వారు ఎక్కడ పుట్టారో, వారు ఎక్కడ పెరిగారో, వారెటువంటి వారో, మొదలగు సంగతులను మనం ముందుగా తెలుసుకొనుట ఎంతో అవసరం.

మన పూర్వికుల పుట్టిల్లు నేడు మన భారతదేశానికి తూర్పున వున్న బంగాళాఖాతంలోని ఫిలిప్పైన్స్ దీవులు (లంకలు), అని ఇటీవల కాలంలో ఒక రష్యన్ విజ్ఞానవేత్త ప్రకటించారు.

ఫిలిప్పీన్స్ దీవులు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నందున అక్కడ సూర్యుని ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా మన పూర్వీకులు ఎండలో, వానలో కష్టపడేవారు. అందువల్ల వారి శరీరాలు నల్లగా ఉండేవట.

నేటికి సుమారు 6-7 వేల యేండ్లకు పూర్వం మన పూర్వీకులలో కొందరు ఆస్ట్రేలియా ఖండానికి, మరికొందరు ఉత్తర భారత ప్రాంతంలోని అలహాబాద్ ప్రదేశానికి, ఇంకొంత మంది పంజాబులోని సింధు నదీ ప్రాంతానికి వలస వెళ్ళారట. పంజాబు ప్రాంతానికి వెళ్ళిన మన పూర్వీకులకు చరిత్రకారులు ద్రావిడులు అని పేరు పెట్టారు. ద్రావిడులు నల్లని శరీరాలు కలిగి ఉండి పొట్టిగా ఉండేవారని చరిత్రకారులంటున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good