అనిశ్చితిని దాటి భగ్నతకి ఆవల ఏముందో వెతికే ప్రయత్నం చేసిన 'బేచారె' కథలు, ముస్లిం యువతరం ఆశలని, ఆశాభంగాలని సమాంతరంగా చూపించాయి. జీవితంలోని ఉత్సవాన్ని, విషాదాన్ని పక్కపక్కనే చూడడం వల్ల వెలుగు నీడల తాత్వికత స్ఫురణకు వస్తుంది. ఈ సుగుణాన్ని కథకుడు ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో సాధించాడు. దీనివల్లనే ఈ కథల్లోని భగ్న ప్రేమలు మోహించీ తపించీ దు:ఖించీ నిరామయంగా మిగులుతూ ఒక సందేశాన్ని పంపాయి తప్ప హింసాత్మకంగా మారలేదు. ఈ కథల్లోని పురుష పాత్రలన్నీ తను తిరస్కరించిన, తనని తిరస్కరించిన స్త్రీలందరి పట్లా దయనీ ప్రేమనీ నిలుపుకుంటూనే ఉన్నాయి. మాట కటువైన మనసు సున్నితమైన ఈ కథకుని ప్రయాణంలో 'బేచారె' ఒక ఆశాసుమం. భగ్నప్రేమల తుఫాను గాలులకు తలొగ్గుతూనే వ్యాపించిన మృదువైన పరిమళం. - డా.కె.ఎన్‌.మల్లీశ్వరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good