''పక్కింటి చిన్నూకి ఏ రేంక్‌ వచ్చింది?''

''నువ్వు రోహిత్‌ కన్నా ఇంగ్లీష్‌లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?''

''గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?''

పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాల్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించరు. పిల్లలకి తల్లితండ్రులు చిన్నప్పటి నించే స్ఫూర్తి నివ్వాలి. లైఫ్‌ స్కిల్స్‌ని బోధించాలి.

ఇలాంటి అవసరం తీర్చడానికే మల్లాది వెంకటకృష్ణమూర్తి కథల రూపంలో రాసిన 'బీ ది బెస్ట్‌' కథల సంపుటి మీ చేతుల్లో ఉంది. దీనిలోని దాదాపు 150 పైగా చిన్న కథల ద్వారా లైఫ్‌ స్కిల్స్‌ని మీ పిల్లలకి బోధించవచ్చు. ఐఐటిలో సీట్‌ ఒక్కటే ముఖ్యం కాదు. జీవితంలో అన్ని రంగాల్లో విజ్ఞతగా, తెలివిగా 'బీ ది బెస్ట్‌'గా ఎదిగేలా మీ పిల్లలు తయారవడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది.

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good