అమెరికావారి 'తానా' అవార్డు పొంది, నవ్యాంధ్రప్రదేశ్‌ డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యాంశంగా వున్న విశిష్ట నవల 'బతుకాట'.


బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాథ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది.


జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకుని, రంగస్థలంపైన గొంతు విప్పి 'అడుగులు' వేయకపోతే తమ బతుకు బండి ఒక అడుగు కూడా ముందుకు సాగలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్థాన్ని వెతుక్కునే... అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యథార్థ జీవనగమనమే 'బతుకాట'. - కె.ఆర్‌.కె.మోహన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good