' దాదాపు వెయ్యేళ్లకుముందునుంచీముస్లింలుఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచనలు చేస్తాను.''
- వైక్కం మహ్మద్‌ బషీర్‌
.... .... ....
వైక్కం మహమ్మద్‌ బషీర్‌ (1908 - 1994) ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవితకాలంలోనే ఓ 'లెజెండ్‌'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కథలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు. ఏకకాలంలో పండిత పామరుల్నీ, ఆబాల గోపాలాన్నీ ఆలరించే రచనా చమత్కృతి బషీర్‌ ప్రత్యేకతలు.
మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్వితితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్‌ రచనలకు అసమాన ప్రాశస్త్యం వుంది. అది నానాటికీ పెరుగుతోంది.
ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కథా సంకలనమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good