యువతీ యువకులు, వయోజనులు, రచయితలు తప్పక చదవాల్సిన పద్యాలు.
నేటి యువతలో పెళ్ళి అయ్యాక భార్యతో ఎలా సంసారం చెయ్యాలో తెలియనివాళ్ళు 5% మంది వున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే భార్యాభర్తల మధ్య సాంగత్యం కుదరక విడాకులు తీసుకోవడం ఎక్కువవుతోంది. కనుక శృంగార జ్ఞానం కూడా నేటి యువతీ, యువకులకు అవసరమే.
భర్తృహరి మానవుల స్వభావాన్ని తన ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించారు. శృంగారమంటేనే బూతు అని అనుకోనక్కరలేదు. నేడు డాక్టర్లు మీరు ఎంత వయసు వారైన, మీ ధర్మపత్ని సహకరించినంతకాలం శృంగారంలో పాల్టొంటే ఇద్దరి ఆరోగ్యాలకు మంచిది అంటున్నారు. దీనర్థం బలవంతమూ, అధర్మమూ అయిన శృంగారానికి వెళ్ళమనికాదు.
మీరు శృంగార దశ దాటాక వైరాగ్య దశలో ఎలా వుండాలో భర్తృహరి తన పద్యాల ద్వారా వివరించారు. యవ్వనం దాటాక ఎలా పెద్దరికం వహించాలో, భక్తి, ముక్తి మార్గంవైపు ఎందుకు వెళ్ళాలో తెలిపే పద్యాలివి.
Pages : 55