తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల - ''బారిస్టర్‌ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్రదాయాలపట్ల గౌరవం, క్రమశిక్షణ, యువతరానికి మార్గదర్శనం చేయడమే ఈ నవలలోని అంతర్లీన సారాంశం. మల్టీకలర్‌ ముద్రణతో (బాపూ బొమ్మలతో) పాఠకులను అలరించడానికి తీసుకొచ్చే ఈ నవలా ప్రకాశకులకు అభినందనలు. - యం.వెంకయ్యనాయుడు


ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రచన 'బారిస్టర్‌ పార్వతీశం'.  ఇది హాస్య రచన. ఎప్పుడూ దూరప్రయాణం చేసి ఎరుగని పార్వతీశం ఒక్కసారిగా 1913వ సంవత్సరంలో నరసింహ శాస్త్రి ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా స్నేహితుల ప్రేరణతో ఇంగ్లండు వెళ్ళాడు. నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమరులో ఇంగ్లండు చేరు వరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఉత్తమ పురుష కథనంలో రకరకాల అనుభవాల్ని రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ నవలలో చిత్రించాడు.


ఎప్పుడూ పట్టణాలూ, నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన, వేషధారణ హాస్యస్ఫోరకంగా ఉంటాయి. ఇందులోని చాలా విషయాలు ఇప్పటివారికి చాలా మామూలుగా అనిపించవచ్చు. కాని ఆ కాలంలో అదొక వింత.

పేజీలు : 528

Write a review

Note: HTML is not translated!
Bad           Good