Rs.100.00
In Stock
-
+
రచయితలకి రసపిచ్చి, చిత్రకారుడికి బొమ్మల పిచ్చి, సినీ దర్శకులకు 'సినేమియా' ప్రకోపం విధాయకమేగాని ఒక చిత్రకారుడికి, చలన చిత్రకారుడికి శాస్త్రీయ సంగీతం పిచ్చి ఉండటం అపురూపంగానే కనిపిస్తుంది. అలాంటి అపురూపవంతుడు బాపు. సంగీతమంటే చెవికోసేసుకుంటామని కొందరు బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు. దాఖలాగా ఒక కాసెట్ టేప్ రికార్డర్ కొని అట్టే పెట్టుకుంటారు. సంగీతం పట్ల ముఖ్యంగా హిందుస్తానీ సంగీతం పట్ల బాపుగారి ప్రేమ అలాంటి బడాయి కాదు. అది నికార్సయిన ప్రేమ. - నండూరి పార్థసారధి