మనం ఒక్కొక్క సంగతి చెప్పడానికి ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వరం ఒక్కొక్క అభినయ వైఖరి వాడుతున్నాం. సరదా సంగతికి ఒక ధోరణి, దు:ఖానికి మరొక రకం, కోపానికి ఇఒకో విధం... అలాగే సంగీతంలో సాహిత్య భావాన్ని బట్టీ గానం చేసే సమయ సందర్భాలను బట్టీ రాగాలు స్వర ప్రసారాలూ మారుతాయి.

అలాగే రకరకాల పరిస్థితులను ప్రతిబింబించే చిత్రాలు మాత్రం ఎందుకు మారకూడదు! అంతేకాదు - చిత్రకారులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, ఈ నగరంలో - ఇతర దేశాలలో ఎందరో చిత్రకారులు, మహానుభావులున్నారు. వారందరూ నా గురువులే - అందరి దగ్గరా నేను ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకుంటూనే వున్నాను. నేను ఒకో ఆర్టిస్టు బొమ్మ చూస్తూంటే ఆయనలా వేయాలనిపిస్తుంది. అలాటి 'ఆయనలు' నాకు శతకోటి ఉండబట్టి నేను ఏ శైలికీ కట్టుబడలేను. ఏ శైలీ నాకు కట్టుబడి ఉండదు' అంటాడు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good