హాయిగా వాక్యాల వెనుక పరుగులెత్తించే శైలి. చక్కని ప్రకృతి వర్ణణలు, పాత్రల మానసిక విశ్లేషణ, ఉత్కంఠ గొలిపే కథనం, అప్పట్లో జరిగిన, జరుగుతోన్న చారిత్రక సంఘటనలను సందర్భోచితంగా వాడుకోవటం`లాంటి లక్షణాల వలన బంకోలా నవల ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లో కోరంగి ప్రాంతంలో జరిగిన ఓడల నిర్మాణము, కోరంగి రేవు నుంచి పెద్ద ఎత్తున జరిగిన వ్యాపారం ఈ నవలకు నేపథ్యం.

బంకోలా చారిత్రక కథాకాలం పద్దెనిమిదో శతాబ్ధం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 1789 కోరంగి సునామీని దృష్టిలో ఉంచుకొని`అప్పటికి ఒక 50/60 సంవత్సరాల క్రితంనాటి నుంచి జరిగిన కథ ఇది. తెలుగులోల ఈ కాలానికి సంబంధించిన రచనలు చాలా తక్కువ.

విదేశీయులు వ్యాపారనిమిత్తమై వచ్చి దేశరాజకీయాలను క్రమక్రమంగా తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటున్నారు. సమాజం సమూలమార్పుకు సిద్ధపడుతోన్న తరుణమది. స్వదేశీయులు మూడురకాలుగా విడిపోయారు.

1. ఈ మార్పుని తమకు అనుకూలంగా మలచుకొని బాగుపడాలనుకొన్నవారు.

2. రాజెవ్వడైతేనేం నా కష్టమే కదా నాకు దిక్కు అనుకొని తటస్థంగా ఉండి పోయినవారు.

3. రాబోతున్న ఉపద్రవాన్ని పసిగట్టి సమాజాన్ని అప్రమత్తం చేయటానికి ప్రయత్నించిన ఆలోచనా పరులు.

వీరందరి సంఘర్షణ ఫలితంగా జరిగిన నాటకీయపరిణామాలే బంకోలా నవల.

పేజీలు : 256

Write a review

Note: HTML is not translated!
Bad           Good