"రవి నువ్వు చెప్పేది నిజమైతే - నేను మళ్ళి మామూలుగా బ్రతకటానికి వీలవుతుందీ అంటే, అంతకంటే నాకు యింకేం కావాలి !
ఈ నాట్యం చేసి చేసి విసుగెత్తిపోయాను . నేను రోజూ సాయంత్రం అయ్యాసరికి, యిష్టం వున్నా లేకపోయినా ముఖానికి రంగు పూసుకుని , కాలికి గజ్జకట్టి మరబోమ్మలా ఆడటమే నా బ్రతుకు అయిపొయింది . నాకీ దర్జాలు , సుఖాలు, ఆడంబరం, ఐశ్వర్యం ఏమి వద్దు. ఇవి కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. చితికిపోయిన నా  బ్రతుక్కి ఎక్కడన్నా ప్రశాంతంగా చిన్న ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటూ యిష్టమైన పుస్తకాలు చదువుకుంటూ ఒకరి వత్తిడి లేకుండా, ఒకరి ఆజ్ఞాలకి బద్దురాలిగా గాకుండా. స్వతంత్రంగా నిర్మలంగా, హాయిగా !నా బ్రతుకు నా ఇష్టంగా గడిపితే చాలు ఆ స్వర్గం నాకు లభిస్తుందా? అంట అదృష్తం నాకుందా యీ జనంలో....
బంగారు కలలతో ఇల్లు దాటినా సరోజ జీవితం ఏమైంది. ? చెడిన ఆడదానికి ఊళ్ళో అంతా మొగుళ్ళేనన్న మాటలు ములుకులై మనసును వ్రయ్యాలు చేస్తే , కాలు జారిన ఆడది మనసు మార్చికుని మంచిగా బ్రతకాలనుకుంటే.. ఈ లోకం ఒప్పుకుంటుందా? సరోజ , రవి, శేషగిరి, చిదంబరం, పురుషోత్తం, రాజారావు. - ఇలా యిందరి రాగద్వేషాల చిత్రణే  ' బంగారు కలలు '
పడుచు మనసుల పరవశాన్ని యువ జీవితాల ఉత్సాహాన్ని నింపుకున్న నవల, యద్దనపూడి కలం నుండి జాలువారిని మరో జలపాతం, 

Write a review

Note: HTML is not translated!
Bad           Good