కథలు చదవడం వలన పిల్లల్లో ఆలోచనాశక్తి పెంపొందుతుంది. ప్రతి విషయంలో ఉండే మంచి, చెడులను అర్ధం చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విన్నాక మాత్రమే స్పందించడం అనే గుణం కూడా అలవర్చుకోగలుగుతారు. కథల్లో ఉపయోగించే కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం వలన వారికి భాష మీద చక్కటి పట్టు ఏర్పడుతుంది. ఎవరికైతే చక్కగా మాట్లాడటం వస్తుందో వారు తమ మనసులో ఉన్న భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు.

పిల్లలు రాత్రివేళ నిద్రించే ముందు కథలు చెప్పడం వలన అవి వారిని ఒక ఊహా ప్రపంచంలో విహరింపజేస్తాయి. ఫలితంగా ఉదయం నుంచి వారి మీద పడిన ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం లభిస్తుంది. తద్వారా వారికి నిద్రలేమి సమస్యలు ఏర్పడవు. ఒక్కసారి మీ పిల్లలకు రోజుకు కనీసం ఒక్క కథ అయినా చదవడం దాని గురించి మాట్లాడటం వారికి ఆ కథ చదివాక ఏమి అర్ధం అయ్యిందో దానిని ఒక కాగితం మీద రాయటం అలవాటు చేయండి. వారిలో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good