యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం 'బలివాడ కాంతారావు కథాకలశం'.

మంచి కథల్ని చదవాలనుకునేవారు, తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాలివి.

తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (అదే జీవితాలకు సమగ్రతను యివ్వడంలో) కాంతారావుగారు తమవంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారని యీ సంపుటిలోని కథలన్నీ రుజువు చేస్తాయి. కథలేగాక కథకుడు కూడా సౌజన్యశీలియై వుండటం వర్తమానంలో చాలా అరుదు. కాని కాంతారావుగారు, గిరీశాలే, రామప్ప పంతుళ్ళే, కరటక శాస్తుళ్ళే ఎక్కువగావున్న యీ కాలంలో కథకులానికి మధురవాణిచేత చెడగొట్టబడకుండా నిలిచిపోయిన సౌజన్యారావు పంతులుగారి లాంటివారు. ఎన్నో మంచి కథలను మనకందించిన కాంతారావుగారు ఒక మంచి మాటకు ఎందుకు అర్హులు కారు? అర్హులే!


Write a review

Note: HTML is not translated!
Bad           Good