సముద్రం ఎంత విశాలమైందో సముద్రశాస్త్రం కూడా అంతే విస్తారమైనది.  మానవాళికి సముద్రం చేస్తున్న మేలు గురించి ఒక భాగంలో చెప్పడం వీలుకాదు.  

''బాలల సముద్రశాస్త్రం'' రెండవ భాగంలో మహాసముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, సముద్రాలందరి జీవరాసుల గురించి చాలా వివరంగా తెలుపబడినది. ఇందులోని విషయాలు బాలురేగాక, పెద్దవారు కూడా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.  అందరూ సముద్రశాస్త్రం గురించి సులభంగా అర్థము చేసుకొనుటకు అనేక పటాల ఫోటోలు ఇందులో చేర్చబడినవి.

బాలలకు ఇది చక్కని కరదీపిక : బాలల సముద్రశాస్త్రం రెండవ భాగం సముద్రశాస్త్రం గురించి తెలుగులో వెలువడిన సమగ్ర గ్రంథం.  ఈ పుస్తకంలో మహాసముద్రాలలోని ప్రవాహాల గురించి చక్కగా విశదీకరించారు.  పలు సముద్రాలలో ప్రవాహాలు ఏ విధంగా భూగోళ శీతోష్ణస్థితి మీద ప్రభావము చూపుతున్న విషయాలు కూడా వివరించారు. అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాలందు ప్రవాహాలు అన్ని ఋతువులలోను ఒకే విధంగా వుండగా ఉత్తర హిందూ మహాసముద్రంలోని ప్రవాహాలు ఋతువులను బట్టి, ఋతుపవనముల ఆధారంగా పూర్తిగా మార్పు చెందటాన్ని చక్కగా వివరించారు.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good