సముద్రాలు భూమి మీద దాదాపు 71% భాగములో ఉన్నాయి. అనాదికాలం నుండి సముద్రాలు మానవుల జీవితాల మీద అత్యంత ప్రభావం చూపిస్తూ వస్తున్నాయి. అందువలన సముద్రాలను గురించి తెలుసుకొనుట మనకందరికి చాలా అవసరము. సముద్రాలను గురించి అన్ని విషయాలు తెలుపు శాస్త్రం సముద్రశాస్త్రం. సముద్రాల గురించి కొన్ని విషయాలు తెలియచేయు ఉద్దేశ్యంతో ఈ బాలల సముద్రశాస్త్రం మొదటి భాగం వ్రాయబడినది. ఇందులోని విషయాలు బాలురేగాక, విద్యార్థులు, పెద్దవారు కూడ తెలుసుకొనవలసినవి చాలా ఉన్నాయి. అందరూ సముద్రశాస్త్రం గురించి సులభంగా తెలుసుకొనుటకు అనేక పటాల ఫోటోలు ఇందులో చేర్చడమైనది.
బాలలకు ఇది చక్కని కరదీపిక : సముద్రాలు మన భూగోళము మీద మూడింట రెండు భాగములు పైగా విస్తరించి వున్నప్పటికీ సముద్రశాస్త్రము గురించి మనకు తెలిసినది చాలా తక్కువే. బాలల సముద్ర శాస్త్రం మొదటి భాగం సముద్రాల గురించి తెలుగులో వెలువడిన సమగ్ర గ్రంథంగా పేర్కొనవచ్చును. పాఠశాల, కళాశాల విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడేటట్లు పండితులకు, పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఏరి కూర్చిన పద్ధతి ప్రశంశాపాత్రము. ఈ పుస్తకంలో సముద్రశాస్త్ర చరిత్ర మరియు సముద్రశాస్త్ర ప్రయోజనాలను గురించి చక్కగా వివరించారు. ఆ రోజులలో మన పూర్వీకులు ఉపయోగించిన ఓడలు, ప్రత్యేకించి పోలినేసియన్లు, హెన్రి యువరాజు, వాస్కోడిగామా, క్రిస్టఫర్ కొలంబస్ మొదలగు దిట్టలు ఉపయోగించిన ఓడలు వాటి చిత్రపటములతో చూపిస్తుంటే చాలా ఆసక్తి కలుగుతుంది.....
Pages : 128